Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మా కాంబినేషన్లో మరో హిట్ 'చట్టంతో పోరాటం': పరుచూరి గోపాలకృష్ణ

  • 'ప్రెసిడెంట్ గారి అబ్బాయి' బాపయ్య చేయవలసింది 
  • ఆ కథ తనకి నచ్చలేదని అన్నారు 
  • తాతినేని రామారావు తీస్తే హిట్ అయింది 
తాజాగా 'పరుచూరి పలుకులు' కార్యక్రమంలో పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ, దర్శకుడు కె. బాపయ్యతో కలిసి తాము కొనసాగించిన ప్రయాణానికి సంబంధించిన జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. "బాలకృష్ణ హీరోగా 'ప్రెసిడెంట్ గారి అబ్బాయి' సినిమాను ముందుగా మేము బాపయ్యగారికి చెప్పాము .. కానీ ఆయనకి కథ నచ్చలేదు. ఆ కథను తాతినేని రామారావుగారు చేయగా అది హిట్ అయింది.

 "ఆ కథను  నేను ఎందుకు వద్దన్నాను .. ఆ తరువాత ఏమైనా మార్చారా" అని ఆయన మమ్మల్ని అడిగారు. 'అలాంటిదేం లేదు .. మీ జోనర్ వేరు .. అందువలన అలా అనిపించి ఉంటుంది' అని చెప్పాము. ఆ తరువాత బాపయ్యగారితో కలిసి 'చట్టంతో పోరాటం' చేశాము. మా కాంబినేషన్లో వచ్చిన మరో అద్భుతమైన హిట్ గా ఈ సినిమా నిలిచింది. ఈ సినిమా హిందీ రైట్స్ అమ్ముడైనప్పుడు మాకు డబ్బులు ఇప్పించింది బాపయ్యగారే" అని చెప్పుకొచ్చారు.    
paruchuri gopalakrishna

More Telugu News